calender_icon.png 18 March, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ

05-03-2025 05:57:49 PM

అంధత్వ నివారణ కొరకు ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్, పీవోలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన బాధితులు..

భద్రాచలం (విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం వారి అధ్వర్యంలో ఎస్ఆర్ఎ, వాసవి అసోసియేషన్ యుఎస్ఎ, వారి సహకారంతో మారుతి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరములో బుధవారం 5వ గ్యాస్ కి చెందిన 210 మందికి ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమంలో క్యాంపు నిర్వహకులు డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ శ్రీజితేష్ వి. పాటిల్ అనుమతితో, ప్రాజెక్టు అధికారి ఐటిడిఎ భద్రాచలం బి. రాహుల్ సహకారంతో ఈ కార్యక్రమమును విజయవంతంగా పూర్తి చేశామని వారికి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లోని కూనవరం, చింతూరు, విఆరురం, ఎటపాక, ఇల్లందు, కరకగూడెం, గుండాల, పినపాక, బూర్గంపహాడ్, అశ్వాపురం, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు చెందిన పేద ప్రజలు, వృద్ధులు పాల్గొని కంటి ఆపరేషన్లు చేయించుకుని కంటి చూపు పొందినారని తెలిపారు. గత నవంబర్ 06, 2024 నుండి నేటి వరకు 100 రోజుల కార్యక్రమంలో మొత్తం 1920 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1076 మందిని కేటరాక్ట్ (కంటి ఆపరేషన్)ల కొరకు ఎంపిక చేసి ప్రఖ్యాతి చెందిన 'పుష్పగిరి కంటి ఆసుపత్రి' సికింద్రాబాద్లో ఆపరేషన్లు నిర్వహించేందుకు తరలించి, 26 బ్యాచ్లుగా దశల వారీగా కంటి. ఆపరేషన్లు నిర్వహించి, 1400 మందిని కళ్ళజోళ్ల పంపిణీకి ఎంపిక చేయగా, నేటి వరకు 1200 మందికి కంటి. అద్దాలు ఉచితంగా అందజేశామని తెలిపినారు.

నేడు 200 మందికి ఉచితంగా కళ్ళ అడ్డాలు పంపిణీ చేశామన్నారు. మిగిలిన 200 మందికి త్వరలోనే కళ్ళ అద్దాలు అందజేస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పుట్టుకతో వచ్చే రక్తహీనత, సికిల్సెల్ ఎనిమియా, తలసేమియా వ్యాధి ఎక్కువగా ఉందని, వాటిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డా.ఎస్.ఎల్. కాంతారావు, వై. సూర్యనారాయణ, తిప్పన సిద్ధులు, చారుగుళ్ల శ్రీనివాస్, వి. కామేశ్వరరావు, గోళ్ళ భూపతిరావు, సిహెచ్ రామలింగేశ్వరరావు, పల్లంటి దేశప్ప, డా. స్వామి, జి.సంజీవరావు, మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు..