calender_icon.png 22 April, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన శాస్త్రాలపై ఉచిత సైన్స్ శిక్షణ శిబిరం

22-04-2025 12:35:36 AM

గోడప్రతులను ఆవిష్కరించిన కుమార్ దీపక్

మంచిర్యాల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : వేసవి సెలవులలో జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో విజ్ఞాన శాస్త్రాలపై ఉచిత సైన్స్ శిబిరం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి మధుబాబులతో కలిసి సైన్స్ సమ్మర్ క్యాంప్ గోడప్ర తులను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రయోగాత్మక విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్థి దశ నుండి విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచుకునేలా అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ఈ క్రమంలో వేసవి సెలవులలో ఈ నెల 25వ తేదీ నుంచి 12 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గల జిల్లా సైన్స్ కేంద్రంలో ఉచిత సైన్స్ శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నూతన ఆవిష్కరణలు రూపొందించడంలో మమేకమై భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాం క్షించారు. శిబిరం కొరకు ఇప్పటి వరకు 212 మంది విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని, ప్రభుత్వ సంబంధిత పాఠశాలలలో 9, 10 తరగతుల విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంద ని, 6 నుండి 10 తరగతుల వరకు ఉన్న పాఠ్యాంశాల సైన్స్ ప్రయోగాలను విద్యార్థులతో ప్రత్యక్షంగా చేయించడం జరుగుతుం దని తెలిపారు.

ప్రతి రోజు ఉదయం 9 నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత శిక్ష ణ అందించడం జరుగుతుందని, గూగుల్ ఫారం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులలో జిల్లాలో మొత్తం 100 మంది విద్యా ర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.