calender_icon.png 27 December, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి

02-10-2024 12:06:19 PM

- సొమ్మసిల్లి పడిపోయిన మహిళలు  ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి

జగిత్యాల, (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలతో మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతుండగా ఊపిరాడక అనేక మహిళా ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరి కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. దసరా పండగ పర్వదినం పురస్కరించుకొని ఆర్టీసీ బస్సుల్లో  మరింత రద్దీ పెరిగింది. జిల్లా కేంద్రమైన జగిత్యాల నుంచి దావనపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు చివరి ట్రిప్పు కావటంతో ఒక్క బస్సులో దాదాపు 150 మందికిపై ప్రయాణికులు బస్సు ఎక్కారు. కిక్కిరిసిపోయిన ప్రయాణికులతో బస్సులో ఊపిరాడక వృద్దులు, ప్రయాణికుల ఇబ్బంది పడ్డారు. ఓ మహిళా ప్రయాణికురాలు ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోగా, మరో ప్రయానికురాలు కూడా ఊపిరి ఆడటం లేదు ఆర్టీసీ బస్సు ఆపాలంటూ కేకలు పెట్టింది. మరి కొందరు మహిళలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం అంటూ అరవడంతో చేసేదేమీలేక డ్రైవర్ బస్సును కాసేపు మార్గం మధ్యలో ఆపారు. ప్రయాణికులు కాసేపు ఊపిరిపీల్చుకున్నాక మళ్ళీ యధావిధిగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం గమనార్హం.