calender_icon.png 6 April, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా పేదలకు ఉచిత బియ్యం

05-04-2025 07:26:46 PM

బిజెపి మండల నాయకులు సంజీవరావు

మందమర్రి (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన నిరుపేదలందరికీ ఉచితంగా బియ్యం అందించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గత కరోనా కాలంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి ఐదు కిలోల ఉచిత బియ్యం అందిస్తుందని బిజెపి నాయకులు దేవరనేని సంజీవరావు స్పష్టం చేశారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలోని రేషన్ షాపు వద్ద శనివారం నరేంద్ర మోడీ ఫోటోతో కూడిన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం పథకం బోర్డును ప్రారంభించి మాట్లాడారు.

ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో భారతదేశ ప్రజలకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ప్రారంభించి నిరుపేదలకు రేషన్ బియ్యం కొనుగోలు బారం కాకూడదని బావించి నిరుపేదలకు దేశ వ్యాప్తంగా ఉచిత బియ్యం అందించిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. ఉచిత బియ్యంను దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవారికి మరో 5 సంవత్సరాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ కర్రే రాజయ్య, మాజీ వార్డ్ సభ్యులు దుర్గం మల్లేష్, నాయకులు కొమురోజు రాము, కడియాల ఉదయ్, సిద్ధం శ్రీను, నామసాని చంద్రశేఖర్, శ్రీకాంత్, సత్యం, గ్రామస్థులు పాల్గొన్నారు.