11-03-2025 03:12:00 PM
అదనపు కలెక్టర్ అమరేందర్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): దివ్యాంగులు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలంటే వారికి విద్య అత్యంత ప్రాధాన్యమైనదని దాన్ని పూర్తిస్థాయిలో అందించినప్పుడే అన్ని రంగాల్లో ముందుంటారని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సఖి భవనం వద్ద జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్(Education Dept Comprehensive Punishment Campaign), అలింకో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డివో రమేష్ కుమార్ తో కలిసి దివ్యాంగులకు ఉచిత రైస్ సైకిళ్లు పంపిణీ చేశారు.
జిల్లాలో 0-18 ఏళ్లలోపు వివిధ లోపాలతో బాధపడుతున్న వారిని గతేడాది ఆగస్టులో పరీక్షలు జరిపి 102 మంది దివ్యాగులకు 12 లక్షల వ్యయంతో 233 పరికరాలు పంపిణీ చేశారు. వీటిలో 78 వినికిడి పరికరాలు, 22 చక్రాల కుర్చీలు, 36 సీపీ కుర్చీలు,16 రొలేటర్స్, 20 చంక కుర్చీలు, 5 బ్రెయిలీ కిట్స్, 2 సుకన్య కేన్ కిట్స్, 93 ఎంఎస్ఐ ఈడీ కిట్స, 9 పుట్ ఆర్థోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ వెంకటయ్య, సఖి కోఆర్డినేటర్ సునీత, ప్రత్యేక అవసరాలు ఉపాధ్యాయులు ప్రకాష్, రాఘవేందర్, శ్యామ్, శ్రీలత, రేనమ్మ, వసంత విజయలక్ష్మి విజయ, జయప్రకాష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.