29-03-2025 12:10:15 AM
హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): గుండె జబ్బులున్న పిల్లలకు నగరంలోని చారిత్రక నిమ్స్ ఆస్పత్రిలో ఉచిత పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ సేవలు అందించనున్నట్లు ఆ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చిన రోగికైనా ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఆహారభద్రత కార్డు ఉన్న వారికి కొత్తగా నిర్మించిన పిడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూ కింద ఉచిత సర్జరీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి పాత భవనం, మొదటి అంతస్తు, వార్డ్ నంబర్ 6దగ్గర డాక్టర్ అమరేష్‌రావు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ గోపాల్‌లను సంప్రదించాలని సూచించారు. అవసరమైన రోగులు 7893337836 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలని చెప్పారు.