calender_icon.png 24 November, 2024 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత పార్కింగ్ కొనసాగించాలి

05-11-2024 02:38:12 AM

నాగోల్ మెట్రో పార్కింగ్ వద్ద ప్రయాణికుల ధర్నా

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి):  నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులు, యువజన సంఘాల నాయకులు సోమవారం ధర్నా చేపట్టారు.  నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఉచిత పార్కింగ్ కొనసాగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ర్ట అధ్యక్షుడు కేఎస్ ప్రదీప్, డీవైఎఫ్‌ఐ రాష్ర్ట కార్యదర్శి ఏ వెంకట్ మాట్లాడుతూ..

ప్రభుత్వ స్థలంలో ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా పార్కింగ్ పేరుతో ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ డబ్బులు దండుకోవడం సరికాదన్నారు. ఉచిత పార్కింగ్‌ను కొనసాగిం చాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ నిబంధనలు తుంగలో తొక్కు తున్నారని విమర్శించారు.

మెట్రోలో ప్రయాణానికి వందల రూపాయలు చెల్లిస్తూ మళ్లీ పార్కింగ్‌కి కూడా ఖర్చుచేయమంటే ఎలా అని ప్రశ్నించారు. ఎల్‌అండ్‌టీ యాజమాన్యం పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రయాణికులెవరూ డబ్బులు చెల్లించడం లేదని తెలిపారు. పెయిడ్ పార్కింగ్‌పై పునరాలోచించాలని కోరారు.