- * ప్రజలే నిర్ణయించుకోవాలి..
- * రాష్ట్రప్రభుత్వాలకు మేం కేవలం సూచనలు చేయగలం..
- * వ్యయాలను నియంత్రించలేం..
- * 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా
పనాజీ, జనవరి 9: ఉచితాలు కావాలో? మెరుగైన సౌకర్యాలు కావాలో? ప్రజలే తేల్చుకోవాలని ఉందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా ఆసక్తికర వ్యాఖ్యలు చే శారు. గోవా రాజధాని పనాజీలో గురువారం రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యా రు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాల్సిన నిధులను ప్రభుత్వాలు ఉచితాల పంపిణీకి వినియోగిస్తున్నాయని వెల్లడించారు. ఆర్థిక కమిషన్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలనే అమలు చేస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఉంటుందని కుండ బద్దలు కొట్టారు.
ఆర్థిక సంఘానికి కూడా పరిమితు లు ఉంటాయని, తాము రాష్ట్రప్రభుత్వాలకు సూచనలు మా త్రమే చేయగలమని తేల్చిచెప్పారు. రాష్ట్రప్రభుత్వాల వ్యయాన్ని తాము నియంత్రించలేమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలను బట్టి ప్రజలు ఓట్లు వేస్తే, వారు కచ్చితంగా హామీలను అడుగుతారని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికార పగ్గాలు చేపట్టిన వారిదేనని పేర్కొన్నారు.