calender_icon.png 6 April, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత కంటి శాస్త్ర చికిత్సలు

05-04-2025 06:48:08 PM

మంచిర్యాల (విజయక్రాంతి): గీతా ధ్యానమండలి ప్రాంగణంలో మంచిర్యాల లయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 75 మంది కంటి శాస్త్ర చికిత్సకు ఎంపిక కాగా మొదట విడతగా 54 మందిని లైన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహిస్తున్న రేకుర్తి ఐ హాస్పిటల్ లో ఉచితంగా కంటి శాస్త్ర చికిత్సలు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు బాలమోహన్, గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ రెడ్డి, ప్రోగ్రాం చైర్ పర్సన్ వి మధుసూదన్ రెడ్డి, విజన్ సెక్రెటరీ డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు గీత ఆ ధ్యాయన మండలి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.