calender_icon.png 19 April, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ అభ్యర్థులకు ఉచిత ఆన్ లైన్ యాప్ ఆవిష్కరణ

19-04-2025 08:45:32 PM

కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ లో డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో తెలంగాణలో టెట్ పరీక్ష కోసం స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ చే రూపొందించిన ఆన్లైన్ క్లాసెస్ కు సంబంధించిన విన్నర్స్ ఆన్లైన్ ఆప్ ను టెట్ అభ్యర్థుల కోసం ఉచితంగా ప్రారంభించడం జరిగింది. ఈ విన్నర్స్ ఆన్లైన్ ఆప్ రాష్ట్రస్థాయిలో టీచింగ్ చేసే నిపుణుల చేత క్లాసులు చెప్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసన్న హరికృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో 33 జిల్లాల్లో గల టెట్ అభ్యర్థులు ఈ  ఆప్ ద్వారా 80 లక్షల విలువ చేసే క్లాసులు ఉచితంగా విని సద్వినియోగపరచుకోవాలని అదేవిధంగా అభ్యర్థుల సందేహాలకు సబ్జెక్టు నిపుణులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటారని తెలియజేశారు.

ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఎన్నిసార్లయినా, ఎక్కడినుండయినా క్లాసులు వినొచ్చని తెలిపారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడుతానని, నిరుద్యోగులకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీం ప్రసన్న హరికృష్ణ సభ్యులు, టెట్ అభ్యర్థులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.