calender_icon.png 19 April, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత మెగా వైద్య శిబిరం

17-04-2025 09:40:27 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో గురువారం RVM హాస్పిటల్ ములుగు,వాసవి క్లబ్, బీబీపేట, VT ఠాకూర్ మెమోరియల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో 365 మంది పరీక్ష చేయించుకొని, 72 మందిని  RVM హాస్పిటల్ కు శుక్రవారం వారిని ఉచిత బస్సులో ములుగు తీసుకువెళ్లి, రోగులకు కావలసిన పరీక్షలు, అవసరమైనచో ఆపరేషన్లు చేసి పంపగలమని RVM నిర్వాహకులు లక్ష్మణ్, సంతోష్, మురళి, గణేష్ తెలిపారు. మెగా వైద్య శిబిరంలో వాసవి క్లబ్ బిబిపేట అధ్యక్షుడు నాగభూషణం మరియు కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, పెద్ది నాగేశ్వర్, ఎర్రం ప్రసాద్, బచ్చు రామచంద్రం, చంద్రశేఖర్, వాసవి క్ల బ్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.