09-03-2025 12:14:48 AM
రెనోవా సెంచరీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ
మిర్యాలగూడ, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడలోని వాసవి భవన్‌లో శనివారం హైద రాబాద్‌కు చెందిన ప్రముఖ ఆసుపత్రి రెనో వా సెంచరీ హాస్పిటల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ మి ర్యాలగూడ సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ మి ర్యాలగూడ నిర్వాహకులు డా.లలిత పిడపర్తి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, డా. ఎన్. పి.పద్మాకర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లంట్ సర్జన్ డా.అశ్విని కుమార్ మైనేని, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. ఖాజా అహ్మ ద్ ఖాన్ ఇంతియాజ్, క్రిటికల్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్ డా.ప్రపుల్ కు మార్ మాండారి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా.రామా వాగ్మారే, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, వైద్యులను సన్మానించారు.
డా.లలిత పిడపర్తి మాట్లాడుతూ.. వైద్య శిబిరంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తోడ్పాటు అందించిన రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారికి డా. ఎన్.పి. పద్మాకర్ కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షుడు రేపాల అంత య్య మాట్లాడుతూ.. ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్ష ణకు కృషి చేస్తున్నామన్నారు. శిబిరంలో 350 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ఉపాధ్యకుడు కర్నాటి రమే ష్, కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శి నరేంద ర్, సభ్యులు దయాకర్, రాంమూర్తి, హరనా థ్, లవకుమార్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.