24 May, 2026 | 1:23 PM

మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

24-05-2026 12:13 PM

వెల్దుర్తి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు సేవ చేయడమే లక్ష్యంగా శ్రీ మహాలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్వాకులు  కొమిరిశెట్టి నరేందర్ గుప్తా అన్నారు. గత వారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి సుమారు 500 మంది నిరుపేదలకు ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు,కాకుండా మందుల పంపిణీ కూడా చేశారు.

అదేవిధంగా ఈరోజు వెల్దుర్తి మండలం శేరిలా గ్రామంలో నివసించే గ్రామ ప్రజల కొరకై ఉచిత మెగా హెల్త్ క్యాంపు ను ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభించారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో ఉచిత బిపి షుగర్ పరీక్షలు అలాగే వారికి అవసరమగు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు నరేందర్ గుప్తా తెలిపారు. ఇకముందు కూడా మండలంలో గ్రామాలలో నిత్యం వారికి సేవ చేసే విధంగానే ముందుకు వెళ్తామని వారు తెలిపారు.