08-04-2025 08:34:02 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో షుగర్, బీపీ, ఈసీజీ, బ్లడ్ టెస్ట్, జనరల్ చికిత్సలు వంటి సదుపాయాలు ఉచితంగా గ్రామ ప్రజలకు కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్, గ్రామపంచాయతీ సెక్రటరీ సుధీర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.