calender_icon.png 22 March, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఖానాపూర్‌లో ఉచిత మెడికల్ క్యాంప్

21-03-2025 05:50:19 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ప్రపంచ అటవీ దినోత్సవం(World Forest Day) సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవి డివిజన్ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శుక్రవారం ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఆవరణ(Khanapur Forest Division Office Premises)లో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ రేంజ్ అధికారి కిరణ్ కుమార్(Forest Range Officer Kiran Kumar) మాట్లాడుతూ... సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా నిర్వహిస్తామని, ఆరోగ్యం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని, ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు మెడికేర్ ఆసుపత్రి డాక్టర్ సాయికిరణ్ రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ జగన్నాథం, దంత వైద్యులు సాయికిరణ్ సాదుల, ఫిజియోథెరపిస్ట్ నాగరాజు, మిషన్ ఐ కేర్ ఆప్టికల్ కంటి వైద్యులు డాక్టర్. చిత్రలత రెడ్డిమల్ల, తదితరులు పాల్గొన్నారు.