calender_icon.png 23 March, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బట్టుపల్లిలో ఉచిత వైద్య శిబిరం

22-03-2025 05:57:30 PM

మంథని (విజయక్రాంతి): ఫౌండేషన్ పటేల్ ఐ కేర్ మంథని వ్యవస్థాపకులు చైర్మన్ బుద్దర్థి సతీష్ కుమార్, (ఆఫ్తలమిక్ అధికారి) ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మంథని మండలం, బట్టుపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఉచిత గుండె నిర్ధారణ పరీక్షలు, రక్త పరీక్షలు, కంటి శుక్లాలు, టెరిజం గ్లోకోమా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి శిబిరంలో పరీక్ష చేయించుకున్నారు. వీరికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బందేల లక్ష్మణ్, మేకల మధు, కండెల సమ్మయ్య, మేకల లచ్చయ్య, కారోబార్ అప్పల మల్లేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.