calender_icon.png 24 October, 2024 | 8:45 PM

చిన్న పిల్లల గుండె వ్యాధుల ఉచిత వైద్య శిబిరం

24-10-2024 05:55:22 PM

వనపర్తి,(విజయక్రాంతి): గుండె సమస్యలు ఉన్న చిన్న పిల్లల కోసం అక్టోబర్ 26న జిల్లా కేంద్రంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఎన్ఎండీసీ లిమిటెడ్ వారి సౌజన్యంతో హృదయ ఫౌండేషన్, హైదారాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఉచిత వైద్య  శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య శిబిరంలో పిడియాట్రిక్ కార్డియాలజీ స్పెషలిస్ట్ లు అందుబాటులో ఉంటారని, 2డి ఎకో సేవలు సైతం పొందవచ్చని తెలిపారు. శిబిరానికి వచ్చే వారు పాత రిపోర్టులతో పాటు, తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు విధిగా తెచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9154289381 నెంబర్ ను సంప్రదించవచ్చని సూచించారు.