రామాయంపేట: రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసనపల్లి మల్లేశంల కుమార్తె సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం రామాయంపేట తహసిల్దార్ రజిని చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజల నివాసాల వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారుగా 200 మంది పరీక్షలు చేసుకున్నారు. వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి హైదరాబాదులోని మల్లారెడ్డి హాస్పిటల్ లో ఎలాంటి రుసుము లేకుండా ఆపరేషన్ లు, ఇతర వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆసుపత్రి ప్రతినిధి మహమూద్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ.. వైద్య శిబిరానికి సహకరించిన మల్ల రెడ్డి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ భవాని, డాక్టర్ మృదుల, వైద్య బృందం అరుణ, ప్రశాంతి, ప్రియా, నాగప్ప, స్థానిక నాయకులు దేవుని రాజు, ఐలయ్య, ఎర్రగొల్ల చిన్న రాములు, భూమ మల్లేశం, దాకి సిద్ధ రాములు, పుట్టి సిద్ధ రాములు, పోచయ్య, పల్లె రాజు, ఎర్రగొల్ల మహేష్, పోచమ్మ పాల్గొన్నారు.