calender_icon.png 5 March, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి దివ్యాంగులకు ఉచిత భోజనం

04-03-2025 12:01:14 AM

కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం, మార్చి 3 (విజయక్రాంతి) : జిల్లా కలెక్టరేట్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులకు ఉచిత భోజన సదుపాయాన్ని మార్చి 5వ తేదీ నుంచి కల్పించ నున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.కలెక్టరేట్ క్యాంటీన్‌లో మధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పించాలని నిర్ణయించామని అన్నా రు.

అన్నం, ఆకు కూర పప్పు, రోటి, పచ్చడి, 2 కూరలు, సాంబార్/రసం, పెరుగుతో మంచి భోజనం దివ్యాంగులకు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ నందు ఉన్న వివిధ కార్యాలయాలకు కూపన్లు పంపడం జరుగుతుందని, 40 శాతం వైకల్యం గల దివ్యాంగులకు వీటిని జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ దివ్యాంగులను కోరారు.