calender_icon.png 21 March, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందా న్యూరో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్ పంపిణీ

21-03-2025 01:27:47 AM

కొత్తపల్లి, మార్చి 20 (విజయక్రాంతి): సున్నితంగా ఉండే తలకు గాయం అయితే ప్రాణాలకే ప్రమాదం, సాధారణంగా హెల్మెట్ లేని బైక్ ప్రమాదాల వల్ల రోజుకు కొన్ని వేలమంది చనిపోతున్నారు. ప్రపంచ తల ప్రమాద అవగాహన దినోత్సవం సందర్భంగా నగరంలోని జగిత్యాల రోడ్డు లోని చందా న్యూరో కేర్ సెంటర్ ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా హాస్పిటల్ చైర్మన్ జయ, శంకర్ రావు , యాంటీ కరప్షన్ టీం ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు గన్ శాం ఓజా పాల్గొని మాట్లాడుతూ హెల్మెట్ ధరించడాన్ని వాహనదారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దానివల్ల రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తలా నీదే రక్షణా నీదే అని , ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు.

ఆర్థో శ్రీనివాస్ ప్రముఖ రేడియాలజిస్ట్ లీల శర్వాణి, ఫిజీషియన్ స్వాతి లు మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడ్డా కూడా తలకు గాయం కావచ్చని ,ప్రతి వ్యక్తి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ పరీక్షలు చేయించుకోవాలని, శరీరంలో జరిగే మార్పులకు కారణాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఇంచార్జి రాజేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు