calender_icon.png 12 January, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు

11-01-2025 09:39:58 PM

సద్వినియోగం చేసుకోవాలని కోరిన టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు 

కూకట్ పల్లి,(విజయక్రాంతి): జర్నలిస్టుల ఆరోగ్య భద్రత(Health Safety of Journalists) కోసం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(Telangana State Working Journalists Association) మేడ్చల్ జిల్లా శాఖ అధ్యక్షుడు గడ్డమిది బాలరాజు(TUWJ District President Gaddamidi Balaraju) ఓ ప్రకటనలో తెలిపారు. బండారు అస్పత్రి ఆధ్వర్యంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుశ్రుత్ పర్యవేక్షణలో  వైద్య శిబిరం జరుగుతుందన్నారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది జర్నలిస్టు వృత్తిపరమైన ఒత్తిడిలకు లోనై గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని  ఉచిత గుండె సంబంధిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉచితంగా ఈసీజీ, 2డి ఈకో,  ఆర్ బి సి లతోపాటు అవసరమైన  ఇతర వైద్య  పరీక్షలను నిర్వహిస్తారని తెలిపారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని  బండారు ఆసుపత్రిలో  ఆదివారం ఉదయం 9 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు. జర్నలిస్టులు దీనిని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలను చేయించుకోవాలని కోరారు.