calender_icon.png 24 December, 2024 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్యమే ప్రభుత్వ విధానం

24-12-2024 01:52:31 AM

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం

ఎల్బీనగర్, డిసెంబర్ 23 : రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ విధానమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కొత్తపేటలోని పండ్ల మార్కె ట్ స్థలంలో నిర్మిస్తున్న ‘టిమ్స్’(తెలంగాణ ఇన్‌స్టూట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్స్) దవాఖాన నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఎల్ అండ్ టీ సంస్థ ఇంజినీర్లు, కొత్తపేట టిమ్స్ దవాఖాన ఇన్‌చార్జి వెంక ట్‌రెడ్డితో ఆస్పత్రి నిర్మాణ పనులపై కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి హైదరాబాద్‌లో నాలుగు టిమ్స్ దవాఖానాలు, వరంగల్‌లో ఒక టిమ్స్ దవాఖానను నిర్మి స్తున్నట్లు తెలిపారు. కొత్తపేటలోని టిమ్స్ దవాఖానను 14 అంతస్తుల్లో సకలసౌక ర్యాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లోని టిమ్స్ దవాఖానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమావేశంలో టిమ్స్ దవాఖాన ఎల్ అండ్ టీ ఇన్‌చార్జి వెంకట్‌రెడ్డి, ఆర్ అండ్ బీ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, చిలక మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.