calender_icon.png 21 January, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతదేశంలో సకలజనులకు వైద్య, విద్య ఉచితంగా అందజేయాలి

21-01-2025 02:48:44 PM

పాల్వంచ,(విజయక్రాంతి): భారతదేశంలో సకల జనులకు విద్యా, వైద్యం ఉచితంగా అందినప్పుడే  కుల వ్యవస్ధ అంతమవుతుందని తెలంగాణా బహుజన ఐక్య వేదిక కన్వీనర్ బరగడి దేవదానం(Telangana Bahujan United Forum Convener Baragadi Devdaman) అన్నారు. పట్టణంలోని ఐక్యవేదిక కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో కుల వ్యవస్థ పేరుకుపోయిందని కుల వ్యవస్ధ అంతమవ్వాలంటే సకల జనులకు విద్యా వైద్యం ఉచితంగా అందించినపుడే సాధ్యమవుతుందని, అంబేద్కర్,పూలే కన్న కలలు సాకారం మవుతాయని, కుల నిర్మూలనే దేశ భవిష్యత్తు కు కారణమని వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు శ్రీపాద సత్యనారాయణ, ముసలయ్య, నబీసాహెబ్ పాల్గొని మాట్లాడుతూ... భారతదేశంలో సకల జనులు సమాన మని చాటిచెప్పి, సంపదలను స్రుష్టించగలిగే విద్యాబుద్దులను ప్రజలకు అందించాలనే భావనే బహుజన ఐక్య వేదిక ప్రధాన ఉద్దేశం మని తెలిపారు.

దేశభక్తిని పెంపొందించే క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని కోరారు.రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను అమలుపరచి వ్యవసాయ భూములను అందరికి సమానంగా పంచాలన్నారు. దేశంలోని సకల సంపదలను జాతీయం చేసి కౌలు విధానంను ప్రవేశపెట్టడం ద్వారా దేశం అభివృద్ధి సాధిస్తుందని తద్వారా ప్రజలు సుఖ జీవనం సాగిస్తారని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక సభ్యులు యస్డీటీ హుస్సేన్, శనగ రామచందర్ రావు, కుడికాల ఆంజనేయులు, ముర్తూజా ఆలీఖాన్, బాబా, అన్నవరం, మంజూరు, రషీద్, బుడగం నాగేశ్వరరావు, తురక లక్ష్మయ్య, రవూఫ్, ఉబ్బన శ్రీను, రాజారావు, జగన్ మోహన్ రావు, గొడ్ల మోహన్ రావు, జూపూడి ప్రభాకరరావు, తాళ్లూరి సత్యనారాయణ, బర్ల వెంకట్రావ్, సోయం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.