calender_icon.png 19 April, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత చేతి పంపులు ప్రారంభం

19-04-2025 12:51:57 AM

కల్లూరు, ఏప్రిల్ 18:-మండల కేంద్రంలోని శాంతినగర్, రఘునాధ బంజర, మండాలపాడులో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చేతి పంపులను సిడిఏ కార్యదర్శి ఏనోస్ కుమార్, వెల్స్ ఫర్ లైఫ్ అధినేత మైకేల్ వైజర్ తో కలసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారని, అందుకే వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు..ప్రజలు త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన వెంటనే స్పందించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ సంస్థ ద్వారా సుమారు 2 లక్షల పది వేల రూపాయల విలువగల చేతిపంపులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ప్రజల దాహార్తిని తీర్చేందుకుగాను వారు చేసిన సహాయమును  బట్టి గ్రామంలో చేతిపంపులను ఏర్పాటు చేయగా గ్రామస్తులు,నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని పూల మాలలతో ,శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏఐసిసి నాయకులు తేలూరి సంజీవరావు, ఇజ్రాయిల్, జీవన్ కుమార్,రాజశేఖర్, సత్యనారాయణ, జైదీప్, మహిళలు పలువురు పాల్గొన్నారు.