calender_icon.png 1 November, 2024 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపం పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

01-11-2024 05:01:55 PM

శ్రీకాకుళం,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లోని తెల్ల రేషన్ కార్డుదారులకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ రీఫిల్‌లను అందించే దీపం పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. నాడు 25 ఏళ్ళ క్రితం దీపం పథకం పెట్టి ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని తెలిపారు. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఈదుపురం మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈదుపురం నుంచి దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.  శాంతమ్మ అనే లబ్ధిదారిణి ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు. చంద్రబాబు గ్యాస్ సిలిండర్‌ను బిగించి పొయ్యి వెలిగించి స్వయంగా టీ తయారు చేశారు. మహిళాకు దీపం పథకం యొక్క ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.