మహిళల టీ20 వరల్డ్‌కప్
దుబాయ్: దుబాయ్ వేదికగా అక్టోబర్‌లో ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. కాగా మెగాటోర్నీ సందర్భంగా 18 ఏళ్ల లోపు ఉన్న యువతీ యువకులకు మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మిగతావారికి మాత్రం టికెట్ రేటును ఐదు దిర్హామ్ (దాదాపు రూ. 115) నిర్ణయించారు. మొత్తం పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి మొదలు కానుంది. 18 రోజుల వ్యవధిలో మొత్తం 23 మ్యాచులు జరగనున్నాయి. దుబాయ్, షార్జాలలో ఈ మ్యాచులు జరగనున్నాయి. అక్టోబర్ 20వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.