calender_icon.png 11 April, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటారంలో 7,8 న ఉచిత కంటి చికిత్స శిబిరం

04-04-2025 06:25:53 PM

కాటారం,(విజయక్రాంతి): స్వర్గీయ అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు  26వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 07,  08 న రెండు రోజుల పాటు పుష్పగిరి కంటి ఆసుపత్రి  వారిచే కాటారం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు. ఉచిత కంటి అద్దాల పంపిణీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీను బాబు  ప్రారంభిస్థారని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని  కాటారం, మహ ముత్తారం, మహదేవ్ పూర్, పలిమెల, మలహర్ రావు  మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.