07-04-2025 05:26:20 PM
కాటారం (విజయక్రాంతి): అసెంబ్లీ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు స్మారకార్థం ఏర్పాటు చేసిన ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma), శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శీను బాబులు ప్రారంభించారు. దుద్దిళ్ళ శ్రీపాద రావు 26వ వర్ధంతి సందర్భంగా పుష్పగిరి ఆసుపత్రి వారు కాటారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి 26వ వర్ధంతి సందర్భంగా కాటారం మండలంలో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేసినందుకు పుష్పగిరి ఆసుపత్రి యాజమాన్యనికి కృతజ్ఞతలు తెలిపారు. కంటి చూపు లోపం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి కంటి పరీక్ష చేసుకోవాలని, చికిత్స అవసరం ఉన్న ప్రతి ఒకరికి ఉచితంగా వైద్య సేవలు అందించి కంటి అద్దాలు కూడా ఇస్తారని తెలిపారు.
మా కుటుంబంపై మీకున్న ప్రేమనురాగాలకు మేము ఎల్లప్పుడూ సేవకులుగా ఉంటామని, భవిష్యత్తులో మరిన్ని పేద ప్రజలకు ఉపయోగపడే సేవ కార్యక్రమాలను మీ ముందుకు తీసుకువస్తామని శ్రీను బాబు అన్నారు. అలాగే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట రాజబాబు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మహాముత్తారం మండల మాజీ జెడ్పిటిసి లింగమల్ల శారద, వెంకట్ రెడ్డి, కొట్టే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.