calender_icon.png 19 April, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

’సురక్ష’ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు

18-04-2025 12:10:29 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 17 : సురక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి, కంటి సమస్యలతో బాధపడేవారికి కొత్త చూపు ఇస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 390 మందికి సురక్ష సేవా సంఘం ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి, శ్రీధన లక్ష్మి ఆప్టికల్స్ సహకారంతో సురక్ష సంస్థ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అబ్దుల్లాపూర్ మెట్టు, హయత్ నగర్ లోని వీరన్నగుట్టకి చెందిన  10 మంది  వృద్ధులకు గురువారం కంటి ఆపరేషన్లు చేయించి, ఇంటి వద్దకు తరలించినట్లు సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిక్కర గోపిశంకర్ యాదవ్ తెలిపారు.  కార్యక్రమంలో శ్రీ ధన లక్ష్మీ ఆప్టికల్స్ ఆప్టో మెట్రిస్ట్ రాజేశ్ గౌడ్, సురక్ష సంస్థ హయత్ నగర్ ఇన్ చార్జి సారిక తదితరులు పాల్గొన్నారు.