22-02-2025 05:49:38 PM
పేదవారి కోసం రూ. 220 రూపాయలకే ఉచిత కంటి ఆపరేషన్
క్లబ్ ప్రధాన కార్యదర్శి అబ్బు కేశవరెడ్డి
మంథని,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ రేకుర్తి కంటి ఆసుపత్రి(Lions Club of Centenary Colony Rekurthi Eye Hospital) కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి అబ్బు కేశవరెడ్డి(Lions Club General Secretary Abbu Kesava Reddy) సహకారంతో ఈ నెల 24న సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు లక్కారం గ్రామ పంచాయతీ భవనం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో కంటి చూపులో లోపాలున్న వారికి డాక్టర్లచే పరీక్ష చేయించి వారిలో మోతే బిందు (కంటిలో శుక్లాలు) ఉన్నవారిని గుర్తించి ఆపరేషన్, అవసరమైన వారిని వెంటనే రేకుర్తి కంటి ఆసుపత్రికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ కరీంనగర్ తీసుకువెళ్లి రేకుర్తి కంటి ఆసుపత్రి(Rekurthi Eye Hospital)లో ఉచితంగా ఆపరేషన్ చేయించబడునని తెలిపారు. అలాగే ఆసుపత్రి నందు భోజనం, వసతి, కంటి అద్దాలు, మందులు ఉచితంగా ఇవ్వబడునని, బయట కార్పొరేట్ ఆసుపత్రిలో ఇట్టి ఆపరేషన్ కి రూ.15 నుండి 20వేల ఖర్చు అవుతుందన్నారు.
కానీ పేదవారికి సహాయం చేయాలని సంకల్పంతో లయన్స్ క్లబ్ మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సహకారంతో కేవలం రూ. 220 రూపాయలకే ఇట్టి ఆపరేషన్ చేయించడం జరుగుతుందన్నారు. కావున ముత్తారం మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ కంటి ఆపరేషన్ కి వచ్చి వారు తమ వెంట ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డ్ ,మొబైల్ ఫోన్, బ్లాంకెట్ వెంట తీసుకొని రాగలరని కానీ మరియు రక్త పరీక్షల(Blood Tests) నిమిత్తము రూ.220 తెచ్చుకోగలరని, మరిన్ని వివరాలకు అబ్బూ కేశవ రెడ్డి 9849885837, గంట వెంకటరమణ రెడ్డి 9849655990 లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మొలుమురి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ, క్లబ్ డైరెక్టర్ గంట వెంకటరమణ రెడ్డి, మాజీ ఎంపీపీ అత్తే చంద్రమౌళి, ఉపాధ్యక్షులు కదార కళాధర్ రెడ్డి, శ్రీధర్, గ్రామ కార్యదర్శి దిలీప్, క్లబ్ సభ్యులు మేకల మారుతి యాదవ్, తాళ్లపల్లి చంద్రమౌళి, మద శ్రీకాంత్ పాల్గొన్నారు.