13-03-2025 02:05:53 AM
మంకమ్మతోట లయన్స్ క్లబ్ వారి సహకారంతో శిబిరం ఏర్పాటు
కొత్తపల్లి, మార్చి 12: ప్రపంచ గ్లకోమ దినోత్సవన్నీ పునస్కరించుకొని లయన్స్ క్లబ్ సభ్యులు బండ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంకమ్మతోట లయన్స్ క్లబ్ వారి సహకారంతో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి వార్డు కార్యాలయం లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి వార్డు ప్రజలు హాజరై పరీక్షలు చేయించుకోవడం జరిగింది.
అవసరమైన వారికి ఉచితంగా కంటి చికిత్స, కళ్లద్దాలు అందిస్తామని రేకుర్తి కంటి ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు మంకమ్మతోట లయన్స్ క్లబ్ అధ్యక్షులు బూర్ల విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి అంబటి రవీందర్ రాజు, కోశాధికారి పాత విశ్వనాథం, పి ఆర్ సి డిస్టిక్ కో ఆర్డినేటర్, కొండూరు లక్ష్మయ్య, రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ సెక్రటరీ నరహరి లక్ష్మారెడ్డి పలువురు సంఘ బాద్యులు తదితరులు పాల్గొన్నారు.