calender_icon.png 18 April, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం

10-04-2025 07:27:20 PM

పాల్వంచ (విజయక్రాంతి): ఎస్పీ రోహిత్ ఆదేశాల మేరకు పాల్వంచ సబ్ డివిజన్ పోలీస్ అధికారి సతీష్ కుమార్ సూచనలతో పాల్వంచ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో గురువారం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బంది వారి కుటుంబాలకు ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శరత్ మాక్సివిజన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పోలీస్ అధికారులు, సిబ్బంది కొరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మనిషికి శరీరంలోని అన్ని అవయవాలలో కళ్ళు చాలా ప్రధానమైనవి అని అన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కంటిచూపును ఎప్పటికప్పుడు సరిగా కాపాడుకోగలిగితేనే మన దైనందిన కార్యక్రమాలను సరిగ్గా చేసుకోగలమని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. అనంతరం ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మందికి పైగా కంటి పరీక్షలు(స్క్రీనింగ్, డిస్టెన్స్ విజిబిలిటీ టెస్ట్) చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సిఐ సతీష్, ఎస్సైలు సుమన్, బిక్షం, రాఘవ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.