calender_icon.png 24 February, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కారంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు

24-02-2025 06:22:21 PM

ముత్తారం (విజయక్రాంతి): లయన్స్  క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ, రేకుర్తి కంటి హాస్పిటల్ కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ముత్తారం మండలం లక్కారం గ్రామంలో క్లబ్ కార్యదర్శి అబ్బు కేశవరెడ్డి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 60 మంది పాల్గొనగా క్లబ్ డైరెక్టర్ డాక్టర్ శరణ్య మారుతి యాదవ్, టెక్నీషియన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి 30 మందిని ఆపరేషన్ కోసం ఎంపిక చేయగా, వారిని ఉచిత బస్ సౌకర్యం కల్పించి కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అబ్బు కేశవరెడ్డి తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రేకుర్తి కంటి హాస్పిటల్ చైర్మన్ కొండ వేణుమూర్తి, వైస్ ఛైర్మన్ చిదుర సురేష్ లఠు ప్రత్యేక కృతజ్ఞతలు క్లబ్ అధ్యక్షులు మొలుమూరు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి, క్లబ్ సభ్యులు పరంకుశం శ్రీనివాస చారి, ముత్తరం మాజీ ఎంపీపీ అత్తే చంద్రమౌళి, విష్ణు గౌడ్, కుమారస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.