calender_icon.png 28 September, 2024 | 4:48 AM

విద్యార్థులకు ఉచితంగా ఎడ్యుకేషన్ టూర్

28-09-2024 03:01:26 AM

తెలగాణ దర్శిని పేరుతో ప్రత్యేక టూరిజం ప్రోగ్రామ్‌ను ప్రకటించిన ప్రభుత్వం

2వ తరగతి నుంచి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కు అవకాశం

కార్యక్రమ కన్వీనర్‌గా టూరిజం కార్పొరేషన్ ఎండీ

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 2వ క్లాస్ నుంచి గ్రాడ్యు యేషన్ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం తెలగాణ దర్శిని పేరుతో ప్రత్యేక టూరిజం ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది.

పాఠ్యాంశాల్లోని చారిత్రక, సాంస్కృ తిక, వారసత్వ, వైవిధ్యమైన ప్రకృతి అందాలను విద్యార్థులకు ఉచితంగా వీక్షించే అవకా శాన్ని కల్పించేందుకు రేవంత్ సర్కారు ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది. ఈ టూరిజం ప్రోగ్రామ్ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ.. పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు.

ఈ కార్యక్ర మం టూరిజం ఆర్థిక వ్యవస్థకు దోహదపడటమే కాకుండా విద్యార్థులకు అవగాహన కల్పించడం, వినోదాన్ని పంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ దర్శిని ప్రోగ్రామ్‌కు కన్వీనర్‌గా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీని నియమించింది. 

మార్గదర్శకాలు ఇలా..

వివిధ శాఖలకు చెందిన నోడల్ అధికారులతో కూడిన కమిటీ విద్యార్థుల టూర్ ప్లాన్‌ను రెడీ చేస్తుందని ప్రభుత్వం ఉత్త ర్వుల్లో పేర్కొంది. సందర్శన స్థలాలు, హాల్ట్ మొదలైన వివరాలను ఆ ప్లాన్‌లో సమగ్రం గా వివరిస్తుంది. సందర్శించాల్సిన ప్రదేశా ల్లో ఆ కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుంది.

ఉపాధ్యాయులు, అధికారులతో పాటు విద్యార్థుల రవాణా, భద్రతను జిల్లా కలెక్టర్, ఎస్పీ చూసుకుంటారని ప్రభుత్వం చెప్పింది. పర్యటనలో భాగంగా విద్యార్థులను ఎకోటూరిజం, ఆర్ట్, క్రాఫ్ట్‌లు, వారసత్వం, సాంస్కృతిక, చారిత్రక, శాస్త్రీయ ప్రదేశాలకు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

సమయాన్ని బట్టి మిగతా పర్యాటక ప్రదేశాలకు కూడా తీసుకెళ్లొచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, విద్యార్థులను పర్యాటక కేంద్రాలకు సెలవు దినాల్లో లేదా పని దినాల్లో అయినా తీసుకెళ్లొచ్చిన చెప్పింది. ఈ ఎడ్యుకేషన్ టూర్ కోసం ప్రభుత్వం విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా విభజిచింది. 

మొదటి క్యాటగిరి: రెండో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు విద్యార్థులను ఒకరోజు పర్యటనకు మాత్రమే తీసుకెళ్లాలి. పాఠశాల ఉన్న గ్రామం లేదా మండల పరిధిలోని స్మారక చిహ్నాలు, వారసత్వ ప్రదేశాలను సందర్శించొచ్చు.

రెండో క్యాటగిరి: 5 నుంచి 8వ తరగతి విద్యార్థులను పాఠశాల ఉన్న 20 కిలోమీటర్ల నుంచి 30 కిలో మీటర్ల పరిధిలోపు తీసుకెళ్లాలి. వీరికి కూడా ఒకరోజు మాత్రమే అనుమతి.

మూడో క్యాటగిరి: 9వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు రెండు రోజుల పాటు టూర్‌కు వెళ్లొచ్చని ప్రభుత్వం చెప్పింది. అయితే వీరు పర్యటించే ప్రదేశాలు 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీట్ల లోపు ఉండాలి. 

నాలుగో క్యాటగిరి: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు నాలుగు రోజుల వరకు పర్యటిం చొచ్చు. వీరు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఈ నాలుగు క్యాటగిరీలకు కలిపి ప్రతి టూర్ లక్ష మంది విద్యార్థులకు పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రభుత్వానికి రూ. 12.10 కోట్లు అవుతుందని అంచనా వేసింది.

ఆ నిధులను వినియోగించుకునేలా..

తెలగాణ దర్శిని అమలుకు కావాల్సిన నిధులపై కూడా జీవో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పర్యాటకం, విద్య, షెడ్యూల్డ్ కులా ల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం,  పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు వద్ద అందుబాటులో ఉన్న నిధులను దీనికి ఖర్చు చేయ నున్నట్లు పేర్కొంది. అవసరమైతే రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీవీబీలు, మోడల్ స్కూల్స్ విద్యార్థులను కూడా వారసత్వ, ఎడ్యుకేషన్ టూర్స్‌కు యువ టూరిజం క్లబ్స్ ద్వారా పంపాలని ప్రభుత్వం భావిస్తోంది.

పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై అవగాహన కోసం.. 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించాలని నిర్ణయించాం. పర్యాటక ప్రాంతాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసమే తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. 

 సీఎం రేవంత్ రెడ్డి