calender_icon.png 15 March, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ యువతకు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ

14-03-2025 12:45:47 AM

మేడ్చల్, మార్చి 13 (విజయ క్రాంతి): తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో బీసీ యువతీ యువకులకు డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి టి ఝాన్సీ రాణి ఒక ప్రకటనలో తెలిపారు.

38 రోజులు శిక్షణ కాలమని, హకీంపేటలో ని టీజీ ఆర్టీసీ కార్యాలయంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం ఉంటుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పర్మనెంట్ లైసెన్స్ అంద జేస్తారని తెలిపారు. ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులైన యువతి యువకులు ఎల్ ఎం వి కొరకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య, హెచ్ ఎం వి కొరకు 20 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు ఈనెల 15 నుంచి 31 వ తేదీలోగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.