30-04-2025 01:09:43 AM
కామారెడ్డి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి అందాల్సిన మంచినీటి సరఫరాలో లోపం తలెత్తడంతో కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ప్రజలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్, యువ కాంగ్రెస్ నాయకుడు అన్మాల రామ్ కుమార్ తన వ్యక్తిగతంగా గ్రామ ప్రజలకు ఉచితంగా మంచినీటి సరపరా చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాక్టర్ ట్యాంకర్ ఏర్పాటు చేసి, ప్రతి రోజు గ్రామంలోని ప్రతి వీధికి నిత్యం శుద్ధి చేసిన మంచినీటిని పంపిణీ చేస్తున్నారు.
ఈ సేవా కార్యక్రమంతో గ్రామస్తులు ఎంతో ఉపశమనాన్ని పొందుతున్నారు. యువకుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు రామ్ కుమార్ చూపిన సేవాభావానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నీటి కోసం గత కొన్ని రోజులుగా ప్రజలు పడుతున్న అవస్థలు నివృత్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువకులు అందరూ కలిసి రామ్ కుమార్‌ను అభినందిస్తూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నీటి అవసరాన్ని తీర్చడంలో చూపిన చొరవకు అతనిని గ్రామస్తులు అభినందించారు.