calender_icon.png 30 April, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహశీల్దార్ కార్యాలయంలో ఉచిత అంబలి పంపిణీ ప్రారంభం

30-04-2025 05:27:05 PM

మందమర్రి (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ సతీష్ కుమార్ ప్రారంభించారు. తహశీల్దార్ కార్యాలయంలో బుదవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబలి పంపిణీ ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకొని మండలంలోని సుదూర గ్రామాల నుండి పనుల నిమిత్తం ప్రతి రోజు అనేక మండి తహశీల్దార్ కార్యాలయంకు వస్తున్నారని వేసవి దృష్ట్యా కార్యాలయానికి వచ్చే వారికి తన వంతుగా సేవ చేసేందుకు ముందుకు వచ్చి అంబలి, తాగునీరు పంపిణీ చేపట్టడం జరిగిందని ఎండలో కార్యాలయానికి వచ్చే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు.

ఈ సందర్బంగా కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారికి స్వయంగా తహశీల్దార్ అంబలి పంపిణీ చేయడం పట్ల గ్రామస్థులు మండల ప్రజలు అభినందించారు. ఏదేమైన ప్పటికీ కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చేవారికి దాహార్తిని తీర్చేందుకు తాగునీరు, అంబలి పంపిణీ చేసి మండలంలోనే వేసవి సేవలందించిన అధికారిగా నిలిచారని అధికారి సేవలను మండల వాసులు ప్రశంసిస్తున్నారు. 

ధ్రువపత్రాల కోసం దళారులను ఆశ్రయించొద్దు

మండలంలోని ప్రజలు విద్యార్థులు యువకులు వివిధ పథకాల కోసం అవసరమైన కులం నివాసం ఆదాయం వంటి ధ్రువపత్రాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని మండల తహసిల్దార్ సతీష్ కుమార్ కోరారు. ధ్రువపత్రాల కోసం అవసరమైన పత్రాలను జత పరచి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం లోపల దరఖాసుదారులకు ధ్రువపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు.

ధ్రువపత్రాలు అత్యవసరం అయిన వారు నేరుగా తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదిస్తే దరఖాస్తును పరిశీలించి వెంటనే ధ్రువపత్రాలు అందించడం జరుగుతుందన్నారు. మండల ప్రజలు దళారులను నమ్మి విలువైన సమయాన్ని ఆర్థికంగా నష్టపోవద్దని ఆయన కోరారు. దళారులు ధ్రువపత్రాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసే వారి వివరాలు అందిస్తే దళారుల ఆగడాలు అరికడతామని ఆయన స్పష్టం చేశారు.