21-03-2025 02:04:48 AM
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్స పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లో మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వ ర్యం ఆశ్రి సొసైటీ అనాథ పిల్లలకు ఉచిత దం పరీక్షలు నిర్వహించారు. వారికి అవసరమైన వైద్య సేవలు అందించి, పిల్లల ఆ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, ప్రోస్థొడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ సీ శరత్‌బాబు మాట్లాడుతూ.. దంతాలు దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటే ముఖ సౌందర్యం ఎన్నో రెట్లు పెరుగుతుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంగీత దర్శకులు కేఎమ్ రాధాకృష్ణ, నేపథ్య గాయకులు అఖిల్ చంద్ర మాట్లాడుతూ.. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు పెద్దలు..
కానీ నోరు బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు. నోటి శుభ్రత బాగుంటే ఆత్మస్థుర్యైం పెరుగుతుందని చెప్పారు. డాక్టర్ శరత్‌బాబు మాట్లాడుతూ.. నోటి శుభ్రత ప్రాముఖ్యాన్ని తెలియజేసేందుకు యేటా మార్చి 20న నోటి ఆరోగ్య దినోత్సవం జరుపుతారన్నారు.