06-03-2025 06:47:44 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ అమ్మ వృద్ధ అనాధ ఆశ్రమంలో గురువారం నిర్మల్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వృద్ధులకు అన్ని రకాల దంత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. దంత రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్లు వెంకటరమణ సతీషు వృద్ధులకు వివరించారు. అనంతరం పండ్లు పంచిపెట్టి భోజనాన్ని ఏర్పాటు చేశారు. దంతుల దంత వైద్య దినోత్సవం కొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాజేష్ రామ్ రెడ్డి నితిన్ వంశీ నరసింహ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.