- గౌరవిస్తున్నామని మమ్మల్ని అలుసుగా తీసుకోవద్దు
- మాటల్లో కాదు చేతల్లో ప్రపంచ శాంతికి కృషి చేయాలి
- మోదీ రష్యా పర్యటనపై అమెరికా దౌత్యవేత్త వ్యాఖ్యలు
న్యుఢిల్లీ, జూలై 12: రష్యాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనపై అమెరికా తీవ్రస్థాయిలో స్పందించింది. దౌత్య విషయాల్లో భారత్ స్వేచ్ఛాయుత నిర్ణయాలకే క ట్టుబడి ఉన్నప్పటికీ సంక్షోభ సమయాల్లో అ ది కుదరదని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సె ట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సం క్షోభం, నాటో సదస్సు వేళ రష్యాలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మో దీ, పుతిన్ భేటీపై ఇప్పటికే అమెరికా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోని భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరిగిన రక్షణ సదస్సులో ఎరిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వ్యూహాత్మక విషయాల్లో స్వేచ్ఛా నిర్ణయాలు తీసు కునేందుకు ఇష్టపడుతుంది.
వారి నిర్ణయా న్ని మేం పూర్తిగా గౌరవిస్తాం. కానీ సంక్షో భం, ఘర్షణల వేళ వ్యూహాత్మక స్వేచ్ఛకు అవకాశం లేదు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో దేశాలకు అండగా ఉండాలి. భారత్, అమెరికా మధ్య సంబంధాలు విస్తృతమైనవి. లోతైనవి. కానీ, అ సంబంధాలను అలుసుగా తీసుకోవద్దు. శాంతివైపు నిలబడ్డామని చెబితే సరిపోదు. నియమాలు పాటి ంచని వారిని చేరదీయొద్దు. ఎందుకంటే ప్ర స్తుత పరిస్థితుల్లో ముప్పును ఒంటరిగా ఎ దుర్కోవడం సాధ్యం కాదు. దేశాల మధ్య బంధాన్ని గౌరవిస్తూ ప్రపంచ శాంతి కోసం సమష్టి చర్యలు చేపట్టాలి అని ఎరిక్ వ్యా ఖ్యానించారు. అయితే, మోదీ మాస్కో పర్యటనపై అమెరికా ఇప్పటికే స్పందించింది. ర ష్యా, భారత్ సన్నిహిత సంబం ధాలపై ఆం దోళనలు ఉన్నప్పటికీ తమ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని యూఎస్ స్పష్టం చేసింది. కానీ, నాటో సదస్సు సమయంలో మోదీ పర్యటనపై పలువురు అమె రికా సీనియర్ అధికారులు అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.