calender_icon.png 6 October, 2024 | 4:05 PM

యువతకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా

06-10-2024 02:00:59 PM

హుజురాబాద్ (విజయక్రాంతి) : రానున్నపట్టు బద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టు బద్రులసమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.  ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండల కేంద్రంలోని సాహితీ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పట్టుబద్రుల  సమావేశానికి హాజరై ఓటరు నమోదుపై  కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తన ఎమ్మెల్సీ పరిధిలోని 4 ఉమ్మడి జిల్లా కేంద్రంలో యువతకు తన సొంత ఖర్చుతో ఒక వృత్తి నైపుణ్య కేంద్రం తో పాటు పోటీ పరీక్షలకు సిద్దమవు తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.

చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి బాసటగా నిలిచి వారి పక్షాన పోరాడుతానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (KGBV) లోని ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ (MTS) అమలుచేసి వేతనాలు ఇవ్వాలని ఉపాధ్యాయుల డిమాండ్ ఉందని, వారి సమస్యలను ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ అయిన పిఆర్సి అమలు, డిఏ పెంపు, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంటకు చెందిన పలు విద్యాసంస్థల అధినేతలు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.