calender_icon.png 9 October, 2024 | 11:52 AM

జియో యూజర్లకు ఉచిత స్టోరేజి

30-08-2024 12:00:00 AM

దీపావళి నుంచి ఏఐ క్లౌడ్ సేవలు

రిలయన్స్ జియో తన యూజర్లకు 100 జీబీ వరకూ ఉచిత క్లౌడ్ స్టోరేజీ సదుపాయాన్ని కల్పించనుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో కూడిన క్లౌడ్ స్టోరేజీ సేవల్ని దీపావళి నుంచి అందిస్తామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. క్లౌడ్‌లో యూజర్లు వారి ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, డిజిటల్ కంటెంట్, డేటాను స్టోర్ చేసుకుని, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు.

ఆహ్వాన ఆఫర్‌గా 100 జీబీ  ఉచిత క్లౌడ్ స్టోరేజిని ఇస్తున్నామని, అంతకంటే ఎక్కువ కావాల్సినవారికి మార్కెట్లోకెల్లా తక్కువ ధరకే ఇస్తామన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అనేది కొద్దిమందికే రిజర్వ్ అయిన విలాసం కాదని, జియో ఏఐ క్లౌడ్ సర్వీసులు కేవలం ఖరీదైన ఫోన్లలోనే కాకుండా, అన్ని డివైజ్‌లకు యాక్సెస్ అవుతుందని వివరించారు. ఎక్కడి నుంచైనా, ఏ డివైజ్‌పైనైనా కనిష్ఠస్పీడు ఉన్న బ్రాడ్‌బ్యాండ్ నెటవర్క్‌ల్లోనైనా జియో యూజర్లు క్లౌడ్ నుంచి వారి డేటాను, ఏఐ సర్వీసుల్ని పొందవచ్చన్నారు. 

ఫోన్‌కాల్ ఏఐ సర్వీసు

జియో కొత్తగా జియో ఫోన్‌కాల్ ఏఐ సర్వీసును ఆవిష్కరించింది. ఈ సర్వీసు వివరాల్ని అకాశ్ అంబానీ వివరిస్తూ జియో యూజర్లు వారి ఫోన్ కాల్స్‌ను రికార్డు చేసి, జియో క్లౌడ్‌లో స్టోర్ చేసుకోవచ్చని, ఆటోమాటిక్‌గా టెక్స్‌గా మార్చుకోవచ్చన్నారు. ఆ కాల్‌ను క్లుప్తీకరించి, మరో భాషలోకి అనువదించుకోవచ్చని తెలిపారు. ముఖ్యమైన కాల్స్‌ల్లో సంప్రదింపుల్ని తిరిగి ఎప్పుడైనా పొందవచ్చు. వాటిలో ప్రధానమైన పాయింట్లను ఏఐ ఎంపికచేసి పెడుతుంది. వివిధ భాషల్లో అర్థమయ్యేలా విశదీకరిస్తుంది.