25-02-2025 01:07:36 AM
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా చికెన్ సెంటర్ లన్ని వెలవెలబోతుండగా సోమవారం విహెఎల్ కంపెనీ చికెన్ షాప్స్ అసోసియేషన్ సిండికేట్ యాజమాన్యం చికెన్ ఫ్రై, ఉడకబెట్టిన ఎగ్స్ ఉచితంగా పంపిణీ చేయడంతో జనం భారీగా ఎగబడ్డారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఏర్పాటుచేసిన స్టాల్లో చికెన్ ఎగ్స్ కోసం భారీగా ఎగబడ్డారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చికెన్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.