calender_icon.png 8 January, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత బస్సు పథకం ఉగాదికి వాయిదా

31-12-2024 05:41:53 PM

అమరావతి,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Travel) మళ్లీ ఆలస్యమవుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడినప్పటికి ఈ సంక్రాంతికి ప్రారంభించాలని ఏపీ సర్కార్ భావించింది. కానీ అది కాస్త ఉగాది వాయిదా పడింది. ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి(Transport Minister Mandipalli Ramprasad Reddy), ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు(APSRTC MD Dwaraka Tirumala Rao)తో ఆయన సమావేశమై ప్రణాళికలను సమీక్షించారు. జీరో టిక్కెట్టు విధానంపై అవసరమైన వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు సమయం పడుతుందని, అందుకే సంక్రాంతి నాటికి పథకాన్ని ప్రారంభించలేమని అధికారులు వివరించారు. ఉగాదికి అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్న రాష్ట్రాలను సందర్శించి, వారి విధానాలు, సవాళ్లు, పరిష్కారాలపై నివేదికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.