calender_icon.png 22 April, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ చిన్నారికి జీవితకాలం ఉచిత బస్ పాస్ నిర్ణయం

22-04-2025 12:36:47 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలం ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తూ టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15న నాగర్‌కర్నూల్‌లో వైద్య పరీక్షలు చేయించుకుని సువర్ణ అనే గర్భిణి హైదరాబాద్ కొల్లాపూర్ బస్సులో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయిది. ప్రయాణికులను కిందకు దింపిన అనంతరం ఆశ కార్యకర్త మల్లికాంతమ్మ గర్భిణికి పురుడు పోయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కండక్టర్ రాజ్‌కుమార్, ప్రైవేటు బస్సు డ్రైవర్ వేణుగోపాల్, ఆశ కార్యకర్త మల్లికాంతమ్మను ఎండీ సజ్జనార్ సోమవారం సన్మానించారు. వనపర్తి జిల్లా చిమనగుంటపల్లికి చెందిన గోర్ల కృష్ణయ్య వనపర్తి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తూ కరోనాతో చనిపోయారు. కాగా ఆయన కూతురు సుమశ్రీ ఇటీవల విడుదలైన గ్రూప్ ఫలితాల్లో 179వ ర్యాంకుతో ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా సజ్జనార్ సోమవారం ఆమెను బస్‌భవన్‌కు పిలిపించి ప్రత్యేకంగా సన్మానించారు.