calender_icon.png 6 March, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

03-03-2025 12:00:00 AM

జగిత్యాల, మార్చి 2 (విజయక్రాంతి) : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని వాసవి కళ్యాణ భవనంలో ఆదివారం శ్రీవల్లభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వ ర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఆయుర్వేద శిబిరంలో ప్రము ఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బదాం రాజేందర్, డాక్టర్ ఎం.ఎ రఫీ, కైరోప్రాక్టర్ గంప నరేష్  రోగులకు  వైద్య పరీక్ష లు నిర్వహించారు.

అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ చెరుకుపల్లి రాజేష్ బాబు, రాష్ర్ట అధ్యక్షులు బోగ రవికుమార్, జిల్లా అధ్యక్షులు ముక్క దాము, జిల్లా ఉపాధ్యక్షులు సంపెట మల్లయ్య, జిల్లా కార్యదర్శి తుమ్మనపల్లి మహేష్, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ అడువాల ప్రభాకర్ , కోరుట్ల టౌన్ ఇంచార్జీ ఆడువాల స్వరూప, కటికె రాజ్ కిషన్,అడ్లగట్ల వెంకటేశం, చిద్రాల రాములు, గొనె శ్రీహరి, కైరంకొండ రాజగంగాధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.