29-04-2025 09:14:53 AM
అమాయక జనాల దగ్గర వేలు, లక్షల టోకరా
మూడు పువ్వులు... ఆరు కాయల దేశ గురువు ఆదాయం
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దేశ గురువును అని చెప్పుకుంటూ అమాయక ప్రజల ఇండ్లలోనికి చేరి మీకు బాగు చేస్తాం అని చెబుతూ రూ.వేల నుండి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దేశ గురువు అని చెప్తూ తెల్ల గుర్రంపై నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ అమాయక ప్రజల దగ్గర వేల డబ్బులు లాగేస్తున్నారు.
గ్రామాల్లో తెల్ల గుర్రంపై తిరుగుతూ ముందు కొంతమందిని మచ్చిక చేసుకొని ఆ గ్రామ ప్రజల వివరాలను సేకరించి మరుసటి రోజు సేకరించిన సమాచారాన్ని బట్టి కొన్ని ఇండ్లను టార్గెట్ చేసి మీకు దోషాలు ఉన్నాయి తొలగిస్తామని చెప్తూ ఇంట్లోకి చేరి గవ్వలు వేస్తూ వ్యక్తిని బట్టి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు అడిగి బేరం కుదిరాక తాను తెచ్చుకున్న సామాగ్రితో తనకు వచ్చిన రెండు, మూడు మంత్రాలను చదివి నీకు బాగు చేయడం అయిపోయిందని ఇట్టి విషయాన్ని వేరే వారికి చెప్పినట్టు నేను చేసిన అనంత వృధా అవుతుంది. అంతేకాకుండా కీడు కూడా సంభవిస్తుందని చెప్పి చివరగా ఒక యాటపోతును బలి ఇవ్వాలి అని బాధితుడు దగ్గర నుండి యాటపోతును తీసుకొని తాను తెచ్చుకున్న టాటా ఏసీ లో వేసుకొని వెళ్లడం జరుగుతుంది.
తుంగతుర్తి మండల కేంద్రంలోని ఓ వ్యక్తి దగ్గర నుంచి 73000 రూపాయలు మరియు యాటపోతు , మరో 10 మంది దగ్గర 20,000 వేల రూపాయల చొప్పున బాగు చేస్తానని తీసుకున్నట్లు సమాచారం. బాధితులు బయటకు చెప్తే ఏం కీడు అతని ద్వారా జరుగుతుందోనని, భయానికి గురై ఎవరికి చెప్పడం లేదు కానీ ఆ నోట ఈ నోట పడి తుంగతుర్తి మండలం లోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈ విధంగా దందా జరుగుతుంది. దేశ గురువు పేరుతో అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కొత్త తరహాలా దేవుని పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం .యదేచక గ్రామంలో డప్పు సాటింపు చేసుకుంటూ అమాయక ప్రజల దగ్గర లక్షల వసూలు చేస్తున్న వ్యక్తిని జిల్లా పోలీసు ఉన్నత అధికారులు, అదుపులో తీసుకొని విచారిస్తే భయంతో నిజం చెప్పని బాధితులు మరింతమంది బయటికి వచ్చే ఛాన్స్ ఉందని ప్రజలు వాపోతున్నారు.