20-03-2025 12:26:59 AM
సంగారెడ్డి, మార్చి 19 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కు అబద్ధాలకు అసెంబ్లీ వేదిక అయింది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఈ సారి బడ్జెట్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే సి ఆర్ హయాంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను పాతర పెట్టి ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్టు ఈ బడ్జెట్ ఉంది.
విషాదం ఏంటంటే అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా ఇచ్చిన 420 హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులను పక్కనపెట్టింది. ఆందోల్ నియోజకవర్గానికే కాదు, సంగారెడ్డి జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నర లక్షల ఎకరాల రైతులకు ఈ ప్రజా ప్రభుత్వం అన్యాయం చేసింది.
చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే