calender_icon.png 21 March, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్ బంకులో బయటపడ్డ మోసాలు..!

20-03-2025 10:52:42 PM

పెట్రోల్ కి బదులు నీళ్లు సరఫరా... 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పెట్రోల్ బంకులో భారీగా మోసాలు బయటపడుతున్నాయి. పెట్రోల్ తో పాటు నీళ్లు సప్లై చేయడంతో ద్విచక్ర వాహనాలు మరమ్మత్తకు గురవుతున్నాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలోని పవనపుత్ర పెట్రోల్ బంక్ వద్ద గురువారం వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.... వెల్దండ మండలం గుండాల గ్రామానికి చెందిన పర్వత రెడ్డి అనే ద్విచక్ర వాహనదారుడు మండల కేంద్రంలోని పవనపుత్ర పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ పోసుకొని ఇంటికి బయలుదేరాడు.

కొద్ది దూరం వరకే వెళ్లిన బైక్ మరమ్మతు గురి కావడంతో బైక్ రిపేర్ దగ్గరికి వెళ్లి పరిశీలించాడు. పెట్రోల్ ట్యాంకులో నీళ్లు ఉన్నట్లు గుర్తించి సదరు పెట్రోల్ బంక్ యజమాని ప్రశ్నించాడు. దీంతో సదరు నిర్వాహకులు పొంతన లేని సమాధానం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు పెట్రోల్ బంక్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పెట్రోల్ శాంపిళ్లను ల్యాబ్ కు తరలించారు.