calender_icon.png 23 March, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరానా మోసం

22-03-2025 10:53:25 PM

వ్యాపారులను బురిడీ కొట్టించి పరారైన కేటుగాడు

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): గచ్చిబౌలిలో ఘరానా మోసం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నార్సింగ్ కు చెందిన చంద్రశేఖర్ ఆన్ లైన్ లో గోల్డ్ వ్యాపారం, నల్లగండ్ల కు చెందిన రఫీ మనీ ఎక్స్చేంజ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం స్టీఫెన్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను బంగారం,అమెరికన్ డాలర్లు కొంటానని నమ్మబలికి చంద్రశేఖర్, రఫీలను గచ్చిబౌలి సెంట్రోమాల్ కు పిలిచాడు. 

స్టీఫెన్ చెప్పిన విధంగా చంద్రశేఖర్, రఫీలు అక్కడికి చేరుకున్నారు. చంద్రశేఖర్ వద్ద 500 గ్రా గోల్డ్ బిస్కెట్స్, రఫీ వద్ద 18వేల యూఎస్ డాలర్స్ తీసుకున్నాడు. అయితే  స్టీఫెన్ ఐదు నిమిషాలలో డబ్బు ఇస్తానని వారిని ఒక రూంలో కూర్చోబెట్టి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ క్రమంలో ఎంతకీ స్టీఫెన్ రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు చంద్రశేఖర్, రఫీలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. నార్సింగ్ కు చెందిన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.